ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్‌!: కేంద్ర మంత్రి

Published on Mon, 03/20/2023 - 15:23

కాంగ్రెస్‌  నాయకుడు రాహుల్‌ గాంధీ లండన్‌లో భారత ప్రజావస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ నేతలు ఆయన్ను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు కూడా. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్‌ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన లండన్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.

ఐనా ఏ వ్యక్తికి అయినా దేశం వెలుపల మాట్లాడే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ తోపాటు బాధ్యతయుతంగా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. ఆమె హయాంలోనే పౌర హక్కులు హరించడం జరిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు  రాహుల్‌ నానమ్మ(ఇందిరా గాంధీ)  చట్టబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఆర్టికల్‌ 356ని 150 సార్లు  ప్రయోగించారన్నారు.

అలాగే చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ను గురించ చెబుతూ ..దాన్ని దూరదృష్టితో కూడిన చర్యగా అభివర్ణించారు. చైనాకు సంబంధించిన బీఆర్‌ఐ ప్రాజెక్టు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా వెళ్తోందని ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, అదానీ సమస్యపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు కారణంగా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడ్డాయి. అదానీ స్టాక్స్‌ ఇష్యూపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాల చేయడంతో ఐదో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వాయిదా పడింది. 

(చదవండి: సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్‌పై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ మండిపాటు)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)