Breaking News

'పాక్‌ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'

Published on Mon, 07/31/2023 - 14:56

భోపాల్‌: పాకిస్థాన్‌లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్‌ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్‌లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 

పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా స్పందించారు.

ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్‌ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్‌ మిశ్రా అన్నారు. అలా పాక్‌కు వచ్చిన యువతికి గిఫ్ట్‌ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. 

రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్‌కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు.   

ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు


 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)