Breaking News

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ

Published on Wed, 07/31/2024 - 12:58

ఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. 

‘‘ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్ట తీసుకురానుంది. ఈ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్‌ సెంటర్లలోని విద్యార్థులతో ఓ కమిటిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తీసుకవచ్చే చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, ఫీజు నిబంధనలు, తప్పుదోవ  పట్టించే కోచింగ్‌ సెంటర్ల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి.  చట్ట రూపకల్పన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. 

..బిల్డింగ్‌ బేస్‌మెంట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌( డీఎంసీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే  రాజేంద్రనగర్‌, ముఖర్జీ నగర్‌, లక్ష్మీ నగర్‌, ప్రీత్‌ విహార్‌లో ఉన్న బేస్‌మెంట్లను కలిగి ఉన్న 30 కోచింగ్‌ సెటర్లను సీజ్‌ చేశాం. మరో 200 కోచింగ్ సెంటర్లకు డీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లో సమర్పిస్తాం.  ఈ ఘటనలో మున్సిపల్‌ అధికారులు  దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని అతిశీ తెలిపారు. 

ఇటీవల ఢిల్లీలోని రాజేంద్రనగర్‌ ఉన్న రావూస్ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి  వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయంతెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)