Breaking News

ఢిల్లీ వాయు కాలుష్యంపై మంత్రి కీలక ప్రకటన

Published on Tue, 12/16/2025 - 16:32

ఢిల్లీ కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి స్పందించారు. కేవలం తొమ్మిది, పది నెలల్లో  ఢిల్లీలోని కాలుష్య తీవ్రతను తగ్గించడం ఎన్నికైన ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని క్షమించాల్సిందిగా మంత్రి మంజీందర్ సింగ్‌ సిస్రా ప్రజలను కోరారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజూకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాజధానిలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ‍ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే గత మూడురోజులుగా ఢిల్లీలోని వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.

మంత్రి మంజీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ  "పర్యావరణ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. తొమ్మిది లేదా పది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఎన్నికైన ఏప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వాయు కాలుష్యాన్ని నివారించడానికి గత ప్రభుత్వంతో పోల్చితే మెరుగైన చర్యలు మేము తీసుకుంటున్నాం" అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిందని దానిని నివారించడానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో  తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్‌ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)