Breaking News

భారత్‌కు మెటా ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’

Published on Sun, 02/16/2025 - 02:39

 అంతర్జాతీయంగా డిజిటల్‌ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం మెటా(Meta) నడుం బిగించింది. ప్రపంచంలోనే అతిపొడవైన సముద్రగర్భ కేబుల్‌ ప్రాజెక్ట్‌ ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’(Waterworth)కు శ్రీకారం చుట్టింది. ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కి.మీ. దూరం సముద్రగర్భంలో కేబుల్స్‌ వేయనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనుంది.

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిజిటల్‌ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం మెటా సాహసోపేత కార్యక్రమానికి నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్‌ ప్రాజెక్ట్‌ ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’కు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనున్నట్టు మెటా శనివారం ప్రకటించింది. కంపెనీకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను ఈ సందర్భంగా అభివర్ణించింది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే భారత్‌ ప్రపంచ డిజిటల్‌ హబ్‌గా అవతరిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంత మొత్తం వ్యయం కానుందనేది కంపెనీ వెల్లడించలేదు.

భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ 
ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌లో భాగంగా ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో కేబుల్స్‌ వేస్తారు. ఇది భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ. సముద్రంలో 7,000 మీటర్ల లోతు వరకు ఈ కేబుల్స్‌ వేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 13న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేర్చారు. నమ్మకమైన సంస్థల సహకారంతో హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్స్‌ నిర్వహణ, మరమ్మతు, రుణం సమకూర్చాలని భారత్‌ భావిస్తోంది.   

అధునాతన సాంకేతికతతో.. 
‘మెటా తన అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది. భారత్, అమెరికా ఇతర ప్రదేశాలను అనుసంధానించడానికి ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం, సాంకేతికంగా అధునాతనమైన సముద్ర కేబుల్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది’అని మెటా ప్రతినిధి శనివారం తెలిపారు. ఇంటర్నెట్‌ కార్యకలాపాలకు సముద్రగర్భ కేబుల్స్‌ ముఖ్యమైనవి. ఈ కేబుల్స్‌ వివిధ దేశాలను అనుసంధానిస్తాయి. స్థానిక టెలికం కంపెనీలు తమ వినియోగదారులకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందించడానికి సముద్రగర్భ కేబుల్స్‌తో కనెక్ట్‌ అవుతాయి. ‘భారత్‌లో డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఈ పెట్టుబడి ఆర్థిక వృద్ధి, స్థిర మౌలిక సదుపాయాలు, అందరికీ డిజిటల్‌ సేవలు అందాలన్న మెటా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’అని మెటా ప్రతినిధి వివరించారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)