Breaking News

అసెంబ్లీలో సీఎంకు భార్య ప్ర‌శ్న‌లు

Published on Thu, 02/26/2026 - 19:44

షిల్లాంగ్‌: ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌ భ‌ర్త‌ను శాస‌నస‌భ వేదిక‌గా లైవ్‌లో భార్య ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం మీరెప్పుడైనా చూశారా? స‌తీమ‌ణి వ‌రుస‌గా సంధించిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం సీటులో ఉన్న శ్రీవారు స‌మాధానాలు చెప్ప‌డం.. చూసేవారికి భ‌లేగా అనిపించింది. ప్ర‌శ్నోత్త‌రాల స‌మయంలో స్వ‌యంగా భార్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముఖ్య‌మంత్రి స‌మాధానం చెప్ప‌డం విశేషం. మేఘాల‌యా శాస‌న‌స‌భ‌లో బుధ‌వారం ఈ ఆస‌క్తిక‌ర అరుదైన దృశ్యాలు క‌నిపించాయి.

ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు ఆయ‌న భార్య ఎమ్మెల్యే మెహతాబ్ చండీ ఎ. సంగ్మా (Mehtab Chandee A Sangma) ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. మంత్రివ‌ర్గంలో నిర్ణ‌యం జ‌రిగిన మూడేళ్ల‌ త‌ర్వాత కూడా ప‌నులు ఎందుకు ముందుకు సాగ‌డం లేద‌ని అసెంబ్లీ సాక్షిగా అడిగారు. వెట‌ర్న‌రీ కాలేజీ, రెండు ఫిష‌రీస్ కాలేజీలు, డైయిరీ క‌ళాశాల ప‌నులు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు. ఈ మూడింటికీ 2022లో రాష్ట్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింద‌ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వెట‌ర్న‌రీ ట్రైనింగ్ సెంట‌ర్ల‌లో సిబ్బంది కొర‌త ఆధికంగా ఉంద‌ని ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు.

ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం కాన్రాడ్ సంగ్మా స‌మాధానం ఇచ్చారు. పశుసంవర్ధక రంగాన్ని బ‌లోపేతం చేయ‌డానికే ఈ మూడు కాలేజీల‌ నిర్మాణానికి త‌మ ప్ర‌భుత్వం పూనుకుంద‌ని చెప్పారు. రూ.334 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న వెట‌ర్న‌రీ కాలేజీ కోసం రి-భోయ్ జిల్లాలోని కిర్దేంకులై ప్రాంతంలో 800 ఎక‌రాల స్థ‌లాన్ని గుర్తించిన‌ట్టు వెల్ల‌డించారు. వెట‌ర్న‌రీ ట్రైనింగ్ సెంట‌ర్ల‌లో సిబ్బంది నియామ‌కాన్ని త‌క్ష‌ణ‌మే చేప‌డ‌తామ‌ని హామీయిచ్చారు.

చ‌ద‌వండి: న‌కిలీ డిగ్రీతో ఐదేళ్లు హైకోర్టు జ‌డ్జిగా తీర్పులు!

నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) త‌ర‌పున గంబెగ్రే నియోజ‌క‌వ‌ర్గానికి మెహతాబ్ చండీ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌లతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి అయిన త‌న భ‌ర్త‌ దృష్టికి తీసుకొచ్చి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు మెహతాబ్ చండీ. ఈ వీడియో చూసిన వాళ్లంద‌రూ.. ప్ర‌జాస్వామ్యంలోని గొప్ప‌త‌నం ఇదేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)