Breaking News

విమానం నుంచి ‘మేడే కాల్‌’.. తప్పిన పెను ప్రమాదం

Published on Sat, 06/21/2025 - 18:50

ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్‌’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

గువహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో గురువారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం.. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం చాలా తక్కువగా ఉందని పైలట్‌ గమనించారు. దీంతో​ వెంటనే అప్రమత్తమైన పైలట్‌ ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి ‘మేడే’ సందేశం పంపారు.

దీంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వైద్య, అగ్నిమాపక సేవలతో సహా అత్యవసర సేవల బృందాలను మోహరించారు. రాత్రి 8:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. 168 మంది ప్రయాణికులు విమానంలో ఉండగా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మేడే కాల్‌  అంటే..
ఎవరైనా పైలట్‌ నుంచి ఏటీసీకి మేడే కాల్‌ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్‌ ఇచ్చిన పైలట్‌ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. 

ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?
విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్‌ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్‌ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్‌ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? 

సివిల్‌ ఏవియేషన్‌ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయ్‌డన్‌ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్‌ స్టాన్లీ మాక్‌ఫీల్డ్‌ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్‌ పదమైన మైడెర్‌కు సమానార్థకం. ఫ్రెంచ్‌లో మైడెర్‌ అంటే సహాయం చేయండి (హెల్ప్‌ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్‌ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్‌ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్‌ ఏవియేషన్‌ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్‌ఓఎస్‌ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.

 


 

 

 


 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)