Breaking News

అతిక్‌ సోదరుల దారుణ హత్య.. మాయవతి రియాక్షన్‌ ఇదే..

Published on Sun, 04/16/2023 - 15:37

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేత, గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారిద్దరినీ ముగ్గురు యువకులు.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి చంపారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈఘటనపై తాజాగా బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పందించారు. 

కాగా, మాయావతి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. గుజరాత్ జైలు నుండి తీసుకువచ్చిన అతీక్ అహ్మద్, బరేలీ జైలు నుండి తీసుకువచ్చిన అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో దారుణంగా కాల్చి చంపారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారికి చంపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఆందోళనకరమైన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా బై లా’ కాకుండా ఎన్‌కౌంటర్‌ ప్రదేశ్‌గా మార్చడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల సమక్షంలో ఇలా హత్యలు జరిగితే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. 

మరోవైపు.. ఈ ఘటనలో లవ్లేశ్‌ తివారీ, సన్నీ, అరుణ్‌ మౌర్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిని విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)