Breaking News

పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్‌ నేత సస్పెండ్‌

Published on Fri, 12/06/2024 - 19:47

లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్‌ కేరీర్‌ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్‌ నాయకుడు సురేంద్ర సాగర్‌ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్‌ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్‌పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.

ఈ సందర్భంగా సురేంద్ర సాగర్‌ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్‌ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?.  నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్‌.. బరేలీ డివిజన్‌లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్‌ పోటీ చేసి ఓడిపోయారు.

ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్‌ దత​్‌ ప్రస్తుతం అంబేద్కర్‌ నగర్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్‌ను సస్పెండ్‌ చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)