Breaking News

ముస్లింలను దళితులతో పోలిస్తే తప్పేంటి? రాహుల్‌కు మాయావతి మద్దతు

Published on Fri, 06/02/2023 - 20:12

సాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ట్విట్టర్లో మద్దతు తెలిపారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. అందుకు ప్రస్తుత, గత ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలన్నారు.   

అందులో తప్పేంటి? 
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన "మొహబ్బత్ కీ దుకాన్" కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.1980ల్లో దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో అంతకంటే ఘోరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం సమర్ధించారు. 

ట్వీట్ సారాంశమేమిటంటే... 
" అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పింది చేదు నిజం. కోట్లాది దళితులు, ముస్లింలు భారత దేశంలో దయనీయ స్థితిలో అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితికి గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ప్రభుత్వాలే బాధ్యత వహించాలి." 

"యూపీలో కానివ్వండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి. ఇప్పటికీ పేద, అణగారిన వర్గాల పట్ల అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మా హయాంలో మాత్రమే యూపీలో ప్రశాంతత నెలకొంది."

కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయ నాయకులు మతపరమైన అల్లర్లు, కులాల మధ్య కొట్లాటలను రెచ్చగొట్టి చరిత్రను ఎన్నో చీకటి అధ్యాయాలతో నింపేశారని రాశారు.      

చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)