Breaking News

మూడో కాన్పుకూ ప్రసూతి ప్రయోజనాలు

Published on Sat, 05/24/2025 - 07:26

న్యూఢిల్లీ: మూడో కాన్పు అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు వర్తించకుండా పోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన కె.ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పిటిషన్‌పై శుక్రవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు రెండు కాన్పులకే వర్తిస్తాయి. ఈ కారణంగా మూడో కాన్పుకు ప్రసూతి సెలవులు నిరాకరించడాన్ని ఉమాదేవికి హైకోర్టులో సవాలు చేయగా ఏకసభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ‘‘తొలి వివాహం ద్వారా ఇద్దరు సంతానం కలిగేనాటికి ఆమె ఉద్యోగంలోనే చేరలేదు. 

పైగా ఆ పిల్లలు ఇప్పుడు మాజీ భర్త సంరక్షణలోనే ఉన్నారు’’ అని గుర్తు చేసింది. ఆ తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేయడంతో ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డివిజన్‌ బెంచ్‌ తీరును జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం తప్పుబట్టింది. మహిళల పునరుత్పత్తి హక్కుల్లో, ప్రసూతి ప్రయోజనాల్లో ప్రసూతి సెలవులు అత్యంత కీలకమైనవని స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వోద్యోగిగా ప్రసూతి ప్రయోజనాలను ఆమె తొలిసారి కోరుతోందని హైకోర్టు సింగిల్‌ జడ్జి వ్యాఖ్యలను ఉటంకిస్తూ గుర్తు చేసింది. ఉమాదేవికి ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు కలి్పంచాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)