Breaking News

బెంగళూరు పబ్లో చెలరేగిన మంటలు: ప్రాణభయంతో దూకేసిన యువకుడు

Published on Wed, 10/18/2023 - 18:57

కర్ణాటకలోని బెంగళూరులో బహుళ అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం హుక్కా బార్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో జనం పరుగలు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టంలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

అగ్నిప్రమాదం తర్వాత పేలుడు సంభవించింది. దీంతో  మంటల్లో చిక్కుకున్న ఒక యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఇది వీడియోలో రికార్డు కావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం  బాధితుడు తిలక్‌నగర్‌లోని కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.  పోలీసుల సమాచారం  ప్రకారం ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రద్దీగా ఉండే కోరమంగళ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం టెర్రస్‌పై ఉన్న మడ్‌పైప్ కేఫ్‌లో జరిగింది. ఈ సంఘటన వెనుక కారణాన్ని మేము ఇంకా నిర్ధారించనప్పటికీ, గ్యాస్ లీకేజీ కారణంగా పైకప్పు రెస్టారెంట్‌లో పేలుడు సంభవించి ఉంటుందని  భావిస్తున్నామని  పోలీసు అధికారి తెలిపారు.

దాదాపు 10 మంది సిబ్బంది ఉండగా వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పించుకున్నారు. 35కి పైగా అగ్నిమాపక సిబ్బందితో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలుమంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.మరోవైపు పాకిస్థాన్, ఆస్ట్రేలియా క్రికెట్ మధ్య శుక్రవారం ఇక్కడ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో  క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనలో పడిపోయారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)