Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 40 మంది మృతి

Published on Sat, 10/05/2024 - 05:16

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి వార్షికోత్సవాల వేళ గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు చనిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌–దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్‌ నేతలు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను  పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో సౌత్‌ అబూజ్‌మడ్‌తో పాటు నార్త్‌ బస్తర్‌ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. 

భారీ బలగాలతో ఆపరేషన్‌  
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 20 వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా బస్రూర్, నారాయణపూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌ స్టేషన్ల నడుమ గోవల్, నెందూర్, తుల్త్‌లీ గ్రామాల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఆర్‌పీఎఫ్, జిల్లా రిజర్వ్‌ గార్డ్స్, బీఎస్‌ఎఫ్, కోబ్రా, ఎస్‌టీఎఫ్‌ విభాగాలకు చెందిన 1,500 మంది జవాన్లు ఆపరేషన్‌ ప్రారంభించారు.

శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయానికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బయటకు సమాచారం అందింది. రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వచి్చంది. రాత్రి 9 గంటల సమయానికి 36 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.    

భద్రతా దళాల ఘన విజయం 
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా బస్తర్‌ ఏరియా ఉంది. ఇక్కడ ఏడు జిల్లాలు ఉండగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్‌ జిల్లాలను దండకారణ్యంగా.. కాంకేర్, నారాయణపూర్, కొండగావ్‌ జిల్లాలు పూర్తిగా, బీజాపూర్, దంతేవాడ జిల్లాలో కొంత భాగాన్ని అబూజ్‌మడ్‌గా పిలుస్తారు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలయ్యాక దండకారణ్య ప్రాంతంలోనే మావోయిస్టులు, పోలీసుల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్టగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం అబూజ్‌మడ్‌లో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మావోయిస్టులు చనిపోవడం కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బగా, భద్రతా దళాల ఘన విజయంగా చెప్పుకోవచ్చు.  



మృతుల్లో.... 
అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్‌కౌంటర్‌లో తూర్పు బస్తర్‌ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్‌ డీవీసీఎం నీతి అలియాస్‌ ఊరి్మళ, కొప్పే, ఎస్‌జెడ్‌సీఎం రామకృష్ణ కమలేశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తమ్ముల రోడ్డు పాలంకి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)