Breaking News

నమ్మించి.. ప్రాణం తీశారు!

Published on Wed, 08/27/2025 - 09:31

గౌరీబిదనూరు (కర్ణాటక): ఇటీవల కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా పరిధిలో లభ్యమైన అపరిచిత మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. హతురాలిని హిందూపురం ప్రాంతానికి చెందిన అర్చనగా నిర్ధారించిన పోలీసులు ఆమెను హతమార్చిన ఓ యువకుడు, యువతిని అరెస్టు చేశారు. మంగళవారం గౌరీబిదనూరు తాలూకా మంచేనహళ్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను పోలీసులు వెల్లడించారు. హిందూపురం సమీపంలోని శ్రీకంఠాపురానికి చెందిన వడ్డే అర్చన (27) క్యాటరింగ్‌ పని చేసేది. ఈ నెల 14న పనికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అర్చన భర్త ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

చున్నీతో గొంతు నులిమి..
అర్చనకు కేటరింగ్‌ పనిలో బెంగళూరుకు చెందిన రాకేష్‌, అంజలితో పరిచయం ఏర్పడింది. అందరూ ఆప్త స్నేహితులుగా మెలిగేవారు. హిందూపురం, బెంగళూరులో ఎక్కడ కేటరింగ్‌ పనులు ఉన్నా కలిసి వెళ్లేవారు. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేష్‌కు అర్చన ధరించే బంగారు నగలపై ఆశ పుట్టింది. 14న అర్చనను పని ఉందని రాకేష్‌ పిలిపించుకున్నాడు. అనంతరం కారులో చిలమత్తూరు, లేపాక్షి, పెరేసంద్ర, గౌరీబిదనూరు తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు నామగొండ్లు సమీపంలో చున్నీతో ఆమె గొంతు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఓ వంతెన కింద పడేసి.. ఎవరూ గుర్తించకుండా బండరాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి ఉడాయించాడు. అనంతరం బంగారాన్ని రూ. 1.95 లక్షలకు కుదువపెట్టి తన ఆటో రుణం కంతు చెల్లించాడు.

పరారీలో డ్రైవర్‌, మరో యువతి
ఈ నెల 17న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ఫిర్యాదు మేరకు మంచేనహళ్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతరం హతురాలిని హిందూపురానికి చెందిన అర్చనగా నిర్ధారించారు. ఈ క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారు. ఆమెకు అందిన ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవం బయటపడింది. దీంతో రాకేష్‌తో పాటు అతనికి సాయపడిన అంజలిని మంగళవారం అరెస్ట్‌ చేసి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన కారు డ్రైవర్‌ నవీన్‌, మరో నిందితురాలు నిహారిక పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)