Breaking News

పర పురుషునితో పరారైన భార్యను..!

Published on Thu, 06/05/2025 - 08:11

మైసూరు: పర పురుషునితో పరారైన తన భార్యను చంపిన ఘటన చామరాజనగరలోని సోమవారపేటె బడావణెలో జరిగింది. విద్య (26) అనే మహిళను ఆమె భర్త గిరీష్‌ హత్య చేసి పరారయ్యాడు. వివరాలు.. కరినంజనపుర బడావణెకు చెందిన విద్యకు సోమవారపేటెకు చెందిన గిరీష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

 కొన్ని రోజుల క్రితం విద్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. తరువాత వాపసు వచ్చిన ఆమెను పుట్టింటివారు, భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు. దీంతో ఆమె మహిళా సాంత్వన కేంద్రంలో ఆశ్రయం పొందింది. ఇటీవల తన మొబైల్‌ను భర్త నుంచి తీసుకుంది. భర్త గిరీష్‌ సాంత్వన కేంద్రానికి వెళ్లి మొబైల్‌ వాపసు ఇవ్వాలని  గొడవ పడ్డాడు.  

ఫిర్యాదు చేసి వెళ్తుండగా దాడి  
దీంతో విద్యా తన భర్త గిరీష్‌ తనను వేధిస్తున్నాడంటూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళా సాంత్వన కేంద్రానికి వెళుతుండగా ఆమెను అడ్డుకున్న గిరీష్‌ పదునైన కొడవలితో దాడికి యతి్నంచాడు. ఆమె చేయిని అడ్డు పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది. ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఓ కెఫె ముందు పడిపోయింది. 

భర్త ఆమె మెడ, భుజనం, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో కెఫెలోని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచగా వారిపై గిరీష్‌ తిరగబడ్డాడు. కొడవలిని అక్కడే పారేసి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు వైపు పరుగెత్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యా మృతదేహాన్ని అంబులెన్స్‌లో నగర శివార్లలోని సిమ్స్‌ బోధనాస్పత్రికి తరలించారు.  ఎస్పీ డాక్టర్‌ బీటీ కవిత, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ లక్ష్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)