Breaking News

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?

Published on Sat, 03/29/2025 - 13:47

అన్నానగర్‌: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. 

వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్‌ జావిద్‌ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్‌. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్‌ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్‌ ఉండిపోయాడు. 

ఇఫ్తార్‌ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్‌ జావిద్‌ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్‌ కోస్ట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయకాంత్‌ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్‌ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)