Breaking News

ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..

Published on Wed, 04/23/2025 - 09:25

లక్నో: ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో​ రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువగా సంఖ్యలో బయటకు వస్తున్నాయి. భర్త, భార్యలను హత్య చేసిన ఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.

తాజాగా మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి జరిగిన రెండు వారాలకే సదరు వ్యక్తి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏమిటంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉండటం, ఆమె కానిస్టేబుల్‌ కావడం. ఈ నేపథ్యంలో మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

వివరాల ‍ప్రకారం.. యూపీలోని రసూల్‌పూర్ గ్రామానికి చెందిన నేహాకు గజల్‌పుర్‌ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్‌ కానిస్టేబుల్‌ నిర్మలతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్‌ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. 

దీంతో, చేసేదేమీ లేక.. అనంతరం మార్చి ఒకటో తేదీన నిర్మలతో నవీన్‌ రెండోపెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి మొహల్లా సాకేత్​ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది నేహా. ఈ క్రమంలో నేహా వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. తర్వాత.. ఏప్రిల్‌ 17న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్‌ పోలీస్‌స్టేషనుకు అటాచ్‌ చేశారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫొటోలు వైరల్‌గా మారాయి.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)