Breaking News

ఐదు లక్షల రివార్డు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Published on Thu, 02/26/2026 - 10:29

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భదత్రా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

వివరాల మేరకు.. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నది తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్‌ఎల్‌ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను, మావోయిస్టు సామగ్రి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, మృతి చెందిన మావోయిస్టులను భద్రతా బలగాలు గుర్తించాయి.

(1) భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు ACM హిచామి మద్దా (₹5.00 లక్షల రివార్డు ఉంది)

(2) భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు ACM మంకి పోడియం (₹5.00 లక్షల రివార్డు)

స్వాధీనం చేసుకున్న సామాగ్రి, ఆయుధాలు:
1. ఒక SLR రైఫిల్, మూడు మ్యాగజైన్‌లు, 55 రౌండ్లు
2. ఒక INSAS రైఫిల్, మూడు మ్యాగజైన్‌లు, 19 రౌండ్లు
3. ఒక 12-బోర్ గన్, రెండు షెల్లు
4. రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రెండు స్వదేశీ హ్యాండ్ గ్రెనేడ్‌లు, డిటోనేటర్లు, స్కానర్ బ్యాటరీలు, యంత్రాంగాలు, మందులు, పౌచ్‌లు

అనంతరం, బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని పోలీసులు, భద్రతా దళాలు ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి కట్టుబడి ఉన్నాయి. DRG, బస్తర్ ఫైటర్స్, STF, CRPF, CoBRA, ఇతర భద్రతా దళాలు పరిసర ప్రాంతాలలో నిరంతర శోధన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని అన్నారు.

అలాగే, బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పట్టలింగం మాట్లాడుతూ..‘మాజీ మావోయిస్టు క్యాడర్లు బార్సే దేవా, రూపేష్, రనిత, రాజ్‌మాన్, రాజు సలాం, దేవ్‌జీ, సంగ్రామ్, భూపతి, వెంకటేష్, చాలా ఇతర మావోయిస్టు కేడర్‌ మాదిరిగానే, మిగిలిన క్రియాశీల కేడర్లు కూడా హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలి. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయుధాలు, హింసలో పాల్గొనడం కొనసాగించడంలో అర్థం లేదు. ప్రభుత్వం.. కేడర్‌తో సహా ప్రతి ఒక్కరికీ ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి కట్టుబడి ఉందని తెలిపారు. 

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)