Breaking News

మావోయిస్టులకు చెందిన రూ.10 లక్షలు స్వాధీనం

Published on Sun, 06/18/2023 - 06:27

బిజాపూర్‌: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌లో చోటుచేసుకుంది. గంగలూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పల్నార్‌ గ్రామానికి చెందిన దినేశ్‌ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్‌ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్‌ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు.

రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్‌ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ.. సెప్టెంబర్‌ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్‌ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్‌ పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)