Breaking News

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన బర్సేదేవా

Published on Fri, 01/02/2026 - 14:41

సాక్షి,హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మడావి హిడ్మా సన్నిహితుడు, బెటాలియన్‌ కమాండర్‌ బర్సేదేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు(సీఎంసీకి)వెన్నెముకగా నిలిచిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కార్యకలాపాలు ముగిసినట్లేనన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హిడ్మా మృతితో కోలుకోలేని దెబ్బ తగలగా.. తాజాగా బెటాలియన్‌ కమాండర్‌ బర్సేదేవా తెలంగాణ డీజీపీ శివదర్ రెడ్డి ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో పాటు మరో 19 మంది  కమిటీ సభ్యులు సైతం ఉన్నారని.. రేపోమాపో వారిని పోలీసుల ఎదుట ప్రవేశ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  

కొద్ది రోజుల క్రితం మావోయిస్టు లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న మడివి హిడ్మా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బరిసే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆయన సైతం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

కాగా మడివి హిడ్మా, బరిసేదేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బరిసే దేవా కీలక పాత్ర పోషించారు. బరిసే దేవా లొంగుబాటు సందర్భంగా పోలీసులు ఆయన దగ్గరినుంచి పెద్ద మెుత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న బరిసే దేవా రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)