Breaking News

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కాల్పుల్లో అగ్రనేత మృతి

Published on Thu, 06/05/2025 - 16:11

చత్తీస్‌గడ్‌:  మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్‌ సుధాకర్‌ మృతిచెందారు. ఈరోజు(గురువారం) ఉదయం నుంచి  నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో గ పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సుధాకర్‌ మృత్యువాత పడ్డారు. 

ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను  ఇటీవల  పోలీసులు అరెస్ట్‌ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.  కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా  ఉన్నారు సుధాకర్‌. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది.  2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్‌  పాల్గొన్నారు.

కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి.  ఇది గతేడాది నుంచి  ఊపందుకోగా, ఈ  ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావో​యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది. 

ఇదిలా ఉంచితే, మావోయిస్టులపై కేంద్ర చేపడుతున్న చర్యలకు నిరసనగా జూన్‌ 10వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌​కు పిలుపునిచ్చింది. అదే సమయంలో జూలై 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది.  

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎనౌకౌంటర్


 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)