Breaking News

స్కూలు బస్సు బోల్తా... ఎనిమిదిమంది చిన్నారులు దుర్మరణం!

Published on Thu, 04/11/2024 - 11:45

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది  చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో  వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మీడియాకు అందిన సమాచారం ‍ప్రకారం ఈ బస్సు  కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది  విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి  తరలించారు. ఈద్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు కూడా సెలవు  ఇవ్వలేదు.

డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)