Breaking News

‘మనూభాకర్‌’ పాత జుమ్లా ట్వీట్‌ వైరల్‌

Published on Sun, 07/28/2024 - 18:53

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం గెలిచిన మనూ భాకర్‌ పాత ట్వీట్‌ ఒకటి తాజాగా వైరల్‌ అవుతోంది. 2018 అక్టోబర్‌లో యూత్‌ ఒలింపిక్స్‌లో మనూభాకర్‌ గోల్డ్‌మెడల్‌ గెలిచిన తర్వాత అప్పటి హర్యానా మంత్రి అనిల్‌ విజ్‌ ఆమెకు రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు. 

అయితే ఈ నగదు అందకపోవడంతో రివార్డు ప్రకటించిన మూడు నెలల తర్వాత మనూ భాకర్‌ ఒక ట్వీట్‌ చేశారు. అనిల్‌విజ్‌ రివార్డు ప్రకటించిన ట్వీట్‌ స్క్రీన్‌షాట్స్‌ పోస్ట్‌ చేస్తూ ‘సర్‌ ప్లీజ్‌ కన్ఫామ్‌ చేయండి. ఈ రివార్డు నిజమేనా లేక ఉత్త జుమ్లానా’అని ప్రశ్నించారు. తమకు రివార్డుగా ప్రకటించిన సొమ్ముతో హర్యానా ప్రభుత్వంలో కొందరు ఆటలాడుతున్నారని భాకర్‌ విమర్శించారు. 

దీనికి స్పందించిన అనిల్‌విజ్‌ రివార్డు గురించి భాకర్‌ తొలుత క్రీడాశాఖలో తెలుసుకుని తర్వాత ఓపెన్‌గా మాట్లాడాలని సూచించారు. భాకర్‌కు రూ.2కోట్ల రూపాయలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. క్రీడాకారులకు క్రమశిక్షణ అవసరం అన్నారు. 

తాజాగా ఈ ట్వీట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. శివసేన(ఉద్ధవ్‌) వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. భాకర్‌కు రివార్డు నగదు ఎగ్గొట్టి ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం రాగానే క్రెడిట్‌ కోసం బీజేపీ నాయకులు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మనుభాకర్‌  షూటింగ్‌లో కాంస్య పతకం గెలుచుకుని ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతా తెరిచారు. 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)