Breaking News

గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్‌ అంటున్న జనం!

Published on Thu, 05/02/2024 - 13:12

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్‌లోని పోర్‌బందర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా  ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్‌బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్‌ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని  ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.

మన్సుఖ్‌ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్‌బందర్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.

తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి  ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్‌బందర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి లలిత్‌ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)