Breaking News

యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి మనోజ్‌ సోని రాజీనామా

Published on Sat, 07/20/2024 - 11:38

ఢిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌ పదవికి మనోజ్‌ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 

2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు.

ప్రొబేషనరీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్‌ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్‌ నోటీసులు కూడా పంపించింది.

కాగా, మనోజ్‌ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
 

 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు