Breaking News

మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. కస్టడీ పొడిగింపు.. బెయిల్‌పై 12న విచారణ..

Published on Wed, 04/05/2023 - 17:50

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్‌ 12న బెయిల్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది.

సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ..

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)