Breaking News

Manipur violence: హింస నివారణలో ప్రభుత్వం విఫలం

Published on Mon, 07/31/2023 - 04:41

ఇంఫాల్‌: మణిపూర్‌లో జాతి వైషమ్యాలను అదుపుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆరోపించింది. మణిపూర్‌ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ తీవ్ర ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. సత్వరమే పరిష్కరించకుంటే దేశ భద్రతకు సైతం సమస్యగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మహిళా గవర్నర్‌ అనసూయ ఉయికేకు ఇచి్చన వినతి పత్రంలో పేర్కొన్నారు.

వారు శని,ఆదివారాల్లో మణిపూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బాధిత ప్రజలకు తక్షణమే పునరావాసం కలి్పంచాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, గృహ దహన ఘటనలు కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం కొనసాగుతుండటంతో వదంతులు వ్యాప్తి చెంది జాతుల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయన్నారు. జాతుల మధ్య పెరిగిన వైషమ్యాలను తక్షణమే చల్లార్చాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని గవర్నర్‌కు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

మణిపూర్‌లో బయోమెట్రిక్‌ సర్వే
2021 సంవత్సరంలో మయన్మార్‌ దేశంలో సైనిక జుంటా అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లోకి పెరిగిన వలసలపై కేంద్రం అప్రమత్తమైంది. అక్రమంగా ప్రవేశించిన మయన్మార్‌ దేశస్తులను గుర్తించేందుకు బయోమెట్రిక్‌ సర్వే చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వం ఇటీవల మణిపూర్, మిజోరం రాష్ట్రాలను ఆదేశించింది. మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో కలిపి 30 వేల మందికిపైగా మయన్మార్‌ దేశస్తులున్నట్లు అంచనా.

కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రస్తుతం సహాయక శిబిరాల్లో సర్వే చేపట్టినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్‌ థంగ్లియానా ఆదివారం  చెప్పారు. సెపె్టంబర్‌ 30వ తేదీలోగా మయన్మార్‌ దేశస్తుల నమోదు పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ కోరిందన్నారు. తమ వర్గానికి చెందిన వారే అయినందున తిరిగి మయన్మార్‌ పంపించలేక వారికి మానవతాదృక్పథంలో ఆశ్రయం కలి్పస్తున్నట్లు తెలిపారు. కొందరు బంధువుల వద్ద, అద్దె ఇళ్లలో ఉంటుండగా ఎక్కువ మంది సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని చెప్పారు.   

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు