Breaking News

మళ్లీ రాజుకుంటున్న మణిపూర్‌

Published on Wed, 09/11/2024 - 02:00

ఇంఫాల్‌: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న ఘర్షణలను నిరసిస్తూ విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. డీజీపీ, భద్రతా సలహాదారును తొలగించాలంటూ గవర్నర్‌ నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టించేందుకు వారంతా మంగళవారం విఫలయత్నం చేశారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైకి రాళ్లు తదితరాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.

దాంతో లోయలోని ఐదు సమస్యాత్మక జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని తొలుత పేర్కొన్నా, అనంతరం దాన్ని ఐదు జిల్లాలకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాజధాని ఇంఫాల్‌తో పాటు పరిసర జిల్లాల్లో  నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఎవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనలు మరింత విస్తరించకుండా చూసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభు త్వం పేర్కొంది. 

మరో 2,000 మందికి పైగా సీఆరీ్పఎఫ్‌ సిబ్బందిని కేంద్రం మణిపూర్‌కు తరలించింది. మణిపూర్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల డ్రోన్, రాకెట్‌ దాడులు జరిగినట్టు వార్తలొచ్చా యి. అవి వాస్తవమేనని ఐజీ కె.జయంతసింగ్‌ తెలిపారు. డ్రోన్లతో పాటు అధునాతన రాకెట్ల తాలూకు విడి భాగాలను పౌర ఆవాస ప్రాంతాల్లో తాజాగా స్వా«దీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అంతకుమించి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తౌబల్‌ ప్రాంతంలో నిరసనకారుల నుంచి దూసుకొచి్చన తూటా ఓ పోలీసును గాయపరిచినట్టు చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)