Breaking News

మంద కృష్ణకు పద్మశ్రీ ప్రదానం

Published on Wed, 05/28/2025 - 00:45

సాక్షి, న్యూఢిల్లీ: పద్మ పురస్కారాలు–2025 ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. వ్యక్తిగత విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ముగ్గురు పద్మశ్రీలు అందుకున్నారు. 

తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల రంగంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, ఏపీ నుంచి సాహిత్యం, విద్యా రంగంలో ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ, వాచస్పతి డాక్టర్‌ వదిరాజ్‌ రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. 

మంద కృష్ణ అవార్డు అందుకుంటున్న సమయంలో ఆయన కుమార్తె కృష్ణవేణి ఉద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్, జి.కిషన్‌రెడ్డి,« బండి సంజయ్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రల్హాద్‌ జోషి, భూపేంద్ర యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)