నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?

Published on Mon, 02/09/2026 - 09:00

 కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కుణిగల్‌ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. 

ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్‌ఆర్‌ నగర నివాసి హరీష్‌ ప్రసాద్‌కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి  2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. 

రూ.2 వేలు పంపి... 
మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్‌ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్‌పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్‌కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)