Breaking News

అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి

Published on Sat, 04/01/2023 - 07:31

మొక్కల నుంచి మానవుని వ్యాధులు సోకుతాయా అని చూసే అరుదైన ఘటన ఇది. ఈ ఘటన కోలకతాలో  చోటు చేసుకుంది.  ప్రొఫెషనల్‌ మైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న 61 ఏళ్ల  వ్యక్తి  ఈ వ్యాధి బారినపడ్డాడు. అతను కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ మొక్కల శిలింద్రాలపై అధ్యయనం తదితరాలు అతని పరిశోధన కార్యక్రమాల్లో భాగం. ఒక రోజు సడెన్‌గా ఆ వ్యక్తి గొంతు బొంగురుపోవడం, దగ్గు, అలసట కనీసం మింగ లేకపోవటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. గత మూడు నెలలుగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇక చేసేది లేక వైద్యలును సంప్రదించగా.. ఈ అరుదైన వ్యాధి గురించ బయటపడింది.

ఈ విషయాన్ని కోల్‌కతాలోని కన్సల్టెంట్‌ అపోలో మల్టిస్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకలు డాక్టర్‌ సోమదత్తా, డాక్టర్‌ ఉజ్వాయిని రే తమ నివేదికలో వివరించారు. అతనికి వచ్చింది కిల్లర్‌ ఫ్లాంట్‌ ఫంగస్‌ అని నిర్ధారించారు. ఇది ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన మొక్కజాతుల్లోని ఆకుల్లో వస్తుందని చెప్పారు. ఈ కేసు మానవులలో వ్యాధి కలిగించే పర్యావరణ మొక్కల శిలీంద్రా సామర్థ్యాన్ని హైలెట్‌ చేయడమే గాక కారక శిలీంద్ర జాతులను గుర్తించేందుకు పరమాణు పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందన్నారు డాక్టర్లు.

ఈ శిలింద్రాలను మాక్రోస్కోపిక్‌ లేదా మెక్రోస్కోపిక్‌ ద్వారా మాత్రమే గుర్తించగలమని చెప్పారు. ఇది వ్యాప్తి చెందగలదా లేదా అన్నది తెలియాల్సి ఉందని చెప్పారు వైద్యులు. ఆ వ్యక్తికి ఈ ఫంగస్‌ కారణంగా మెడపై గడ్డ ఏర్పడిందని, దాన్ని తొలగించి యాంటి ఫంగస్‌ మందులతో చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్ల పర్యావేక్షణ అనంతరం కోలుకుని బయటపడటమే గాక పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు.

(చదవండి: అమృత్‌పాల్‌ కోసం డేరాల్లో గాలింపు)

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)