Breaking News

యూపీఎస్‌సీ కోసం.. అధిక జీతం వదులుకుని.. ‘కనిష్క్‌’ సక్సెస్‌ స్టోరీ

Published on Tue, 12/03/2024 - 11:32

న్యూఢిల్లీ: విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని అవగతమయ్యేలా చేస్తాయి. యూపీఎస్‌సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ (ఏఐఆర్‌)ను సాధించాడు.

కనిష్క్‌ కటారియాది రాజస్థాన్‌లోని జైపూర్‌. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అతనికి దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్‌ కంపెనీలో  కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్‌ వచ్చింది. వెంటనే ఆయన ఆ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరారు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్‌  భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉన్న ఒక అమెరికన్ స్టార్టప్‌లో చేరారు. ఆ ఉద్యోగంలో అధిక జీతం వస్తున్నప్పటికీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్‌)లో చేరాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు  ఉద్యోగాన్ని వదిలి జైపూర్‌కు తిరిగి వచ్చాడు.

తరువాత రాజధాని ఢిల్లీకి చేరుకుని యూపీఎస్‌సీ పరీక్షకు కోచింగ్‌ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా  ఎంచుకుని పరీక్షలో విజయం సాధించారు. కనిష్క్‌ రాత పరీక్షలో  942 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌లో 179 మార్కులు సాధించారు. మొత్తం మీద 2025 మార్కులకు గాను 1,121 మార్కులు దక్కించుకున్నారు.

రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన అతని తండ్రి సన్వర్ మల్ వర్మ నుండి కనిష్క్‌ ప్రేరణ పొందారు. తండి అడుగుజాడల్లో నడుస్తూ తన కలను సాకారం చేసుకున్నారు. కనిష్క్‌ కటారియా రాజస్థాన్ ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ (డీఓపీ)లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. 

ఇది కూడా చదవండి; లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ

#

Tags : 1

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)