Breaking News

Delhi Metro: మరో వీడియో వైరల్‌.. ఈసారి మద్యం వంతు..

Published on Thu, 04/10/2025 - 08:56

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో ఢిల్లీ మెట్రో(Delhi Metro)కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో మెట్రోలో కూర్చున్న ఒక ప్రయాణికులు ఒక చేతితో మద్యం గ్లాసు పట్టుకుని తాగుతూ, మరో చేతితో ఉడికించిన గుడ్డును తింటున్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారా అని అటునిటు చూస్తూ మద్యం సిప్ చేస్తున్నాడు. దీనిని గమించిన ఒక ‍ప్రయాణికుడు వీడియో తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు.

ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను సోషల్‌ మీడియా(Social media) ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ‘మెట్రోలో గుడ్లు, మద్యం తీసుకోవడం అనేది అల్పాహారమేమీ కాదు. ఇది నియమాల ఉల్లంఘన.  ఇలా చేసినందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని  హెచ్చరించారు. అయితే మెట్రోలో కనిపించిన ఆ వ్యక్తి పోలీసులకు క్షమాపణలు చెబుతూ ‘ఆ వీడియోలో నేను గుడ్డు తింటూ, మద్యం తాగుతున్నట్లు కనిపించాను. కానీ అది మద్యం కాదు, అప్పీ ఫిజ్ (Appy Fizz)’ అని వివరణ ఇచ్చాడు.
 

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)ఈ ఘటనపై స్పందిస్తూ మెట్రోలో మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధమని, ప్రయాణికులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించింది. డీఎంఆర్‌సీ(DMRC) ఒక అధికారిక ప్రకటనలో ‘ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా  రూపొందించినట్లు కనిపిస్తోంది. మద్యం సేవించడం లాంటి వ్యవహారాలు మెట్రో నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది’ అని పేర్కొంది. అలాంటి ఘటనలను ఎవరైనా చూస్తే, వెంటనే మెట్రో సిబ్బందికి లేదా సీఐఎస్‌ఎఫ్ అధికారులకు తెలియజేయాలని కోరింది. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు ఆ వ్యక్తి చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతని వివరణ హాస్యాస్పదమని కామెంట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌ ఆరోపణలపై చైనా ఆగ్రహం

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు