Breaking News

ఇద్దరూ కావాలి సార్‌.. ఎవరినీ వదులుకోలేను!

Published on Thu, 06/11/2026 - 08:32

చెన్నై : దిండుక్కల్‌ జిల్లాలోని వడమదురై సమీపంలో ఉన్న సెంగురిచికి చెందిన సడైయాండి (28) వెల్డర్‌ గా పనిచేస్తున్నాడు. ఇతనికి, సుమతి (26)కి వారి తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగుతూ ఉంటాయి. సడైయాండి ఇంటికి వచ్చినప్పుడల్లా తన సెల్‌ ఫోన్‌లో ఒంటరిగా మాట్లాడుకుంటాడు. 

ఇతని భార్య ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినప్పుడు, అతను ఆమెను మందలిస్తాడు. ఈ విషయం ఇలాగే కొనసాగుతుండగా, సడైయాండి అకస్మాత్తుగా సెల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. దీంతో సుమతి వడమదురై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తు వచ్చారు. ఈ స్థితిలోసడైయాండి పుత్తూరు పిచంపట్టికి చెందిన నాగేశ్వరి (21) అనే మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవిస్తున్నాడని వెల్లడైంది. 

అతను పెళ్లికానివాడిలా నటించి, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవించడం ప్రారంభించాడు. ఈ విషయం పోలీసులు మొదటి భార్యకు తెలియజేశారు. సుమతి బంధువులు అక్కడికి వెళ్లి రెండో భార్యను వడమదురై పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. తనకు ఇద్దరు భార్యలూ కావాలని సడైయాండి కోరాడు. రెండో భార్య  తాను తన భర్తతో వెళ్తానని పట్టుబట్టింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.  
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)