Breaking News

పోయిరా పోయిరా మామా.. అరే రాజాలాగా దర్జాగా పోయిరా మామా

Published on Sat, 08/02/2025 - 14:04

‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’... ఈ తెలుగు పాట స్నేహానికున్న గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పదనేవారు కూడా ఉన్నారు. ‘స్నేహమంటే ఊపిరి కదరా’ అంటూ చెట్టపట్టాల్‌ వేసుకుని తిరిగేవారు కూడా మనకు కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి ప్రాణస్నేహితుడు కనుమరుగైతే.. ఏకాకిగా మిగిలిన ఆ స్నేహితుని పరిస్థితి ఏమిటి?.. అతని హృదయం ఎలా ద్రవిస్తుంది?.. తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లాల్సిందే..

ఇండోర్‌కు చెందిన ఒక వ్యక్తి తన ప్రాణ స్నేహితుని మృతి అనంతరం అతని అంత్యక్రియల ఊరేగింపులో కన్నీళ్లతో నృత్యం చేస్తున్న భావోద్వేగ దృశ్యం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మందసౌర్ జిల్లాలోని జవాసియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంబాలా ప్రజాపత్ తన ప్రాణ స్నేహితుడు సోహన్‌లాల్ జైన్‌కు ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని అతని అంత్యక్రియల సమయంలో నిలబెట్టుకున్నాడు.

2023 నుండి క్యాన్సర్‌తో పోరాడుతున్న జైన్, తన మరణానికి ముందు  అంబాలాకు రాసిన ఒక లేఖలో.. తన మరణ సమయాన నిశ్శబ్దంగా  కూర్చోవద్దని, దుఃఖంతో విచారించవద్దని, తన అంత్యక్రియల సమయంలో పండుగ జరుపుకోవాలని కోరాడు. జైన్ రాసిన ఆ లేఖలో ‘నేను ఈ  ప్రపంచం నుంచి కనుమరుగైనప్పుడు కన్నీళ్లు వద్దు, నిశ్శబ్దం అంతకన్నా వద్దు, వేడుక చేసుకోవాలి.  నా అంత్యక్రియల ఊరేగింపులో  డప్పు శబ్ధాలకు అనగుణంగా నృత్యం చేస్తూ, నాకు వీడ్కోలు పలకాలి. విచారంతో, ఏడుపుతో నన్ను పంపించవద్దు. సంతోషంగా నాకు వీడ్కోలు చెప్పండి’ అని కోరాడు.

స్నేహితుని అభిలాషను గౌరవిస్తూ అంబాలా  తన స్నేహితుని అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేశాడు. జలపాతంలా ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ, నృత్యం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని కట్టిపడేస్తోంది. ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం సోహన్‌లాల్ జైన్ ఏడాది కాలంగా  క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. జైన్ కుమారుడు ముఖేష్ మాట్లాడుతూ, తన తండ్రి చివరి కోరికను నెరవేర్చగలిగినందుకు అందరం సంతోషంగా ఉన్నామన్నారు. 

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)