Breaking News

ప్రేమ ఎంత గరళం!

Published on Sun, 10/12/2025 - 05:34

ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా.. పండెననుకో ఈ బతుకే మనసు తీరా.. అన్నాడొక కవి. ఆ కుర్రాడు కూడా ప్రేమించాడు. ప్రేమను పండించు కోవాలనుకున్నాడు. శాశ్వతంగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. అదే నేరమైంది. గరళమైంది. ఇరవయ్యేళ్లకే నూరేళ్లు నింపింది. గులాబీలు ఇచ్చిన చేతులతోనే గటగట గరళం తాగాడు.  ప్రేమను నిరూపించుకోవాలనే పెద్దల శాసనం.. అతనికి మృత్యు శాసనమయ్యింది.

ఇరవయ్యేళ్లకే నూరేళ్లు
ఇది సినిమా కథ కాదు.. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిన ఒక హృదయాన్ని మెలిపెట్టే విషాదం. కృష్ణకుమార్‌ పాండో (20).. సోనారి గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వారిద్దరి గాఢమైన ప్రేమబంధం అమ్మాయి కుటుంబానికి తెలిసిపోయింది. ఆ రోజు సెప్టెంబర్‌ 25.. ఆ యువతి కుటుంబం కృష్ణను తమ ఇంటికి పిలిపించింది. తన ప్రేయసి కుటుంబం ముందు కృష్ణ ధైర్యంగా నిలబడ్డాడు. అతని ధైర్యమల్లా.. ఆ క్షణంలో తన గుండె నిండా ఉన్న నిస్వార్థమైన, నిండైన ప్రేమే. కానీ ఆ కుటుంబం అతని ప్రేమను నమ్మడానికి ఒక అగ్నిపరీక్ష పెట్టింది. కాదుకాదు బలిపీఠం ఎక్కించింది.

విషం తాగి నిరూపించుకో..
‘నీ ప్రేమ నిజమే అయితే విషం తాగి నిరూపించుకో’.. అన్న పెద్దల మాటలు అతని చెవుల్లో ఎలా ఉరిమి ఉంటాయో ఊహించండి. ప్రేమ కోసం ఏదైనా చేస్తాననే యువకుడి ఆరాటాన్ని ఆ కుటుంబం దారుణంగా ఉపయోగించుకుంది. బహుశా ఆ క్షణంలో అతనికి తన జీవితం కంటే, తన ప్రేమ నిజమని రుజువు చేయడమే ముఖ్యం అనిపించిందేమో. వెనకా ముందూ ఆలోచించలేదు.. కృష్ణకుమార్‌ విషం తాగేశాడు. విషం.. అతని శరీరంలోకి ప్రవహించింది. ప్రతి కణాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది.

నరకయాతన అనుభవించి..
ఆ తరువాత, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు కృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా ఆసుపత్రికి మార్చినా, అతని పరిస్థితి విషమంగానే ఉంది. అతని గుండె, ఊపిరితిత్తులు ఆ విష ప్రభావానికి లొంగిపోతుంటే, చివరి క్షణాల్లో ఏం గుర్తుకొచ్చిందో.. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముఖమా.. లేదా తన ప్రేమను బలిపీఠం ఎక్కించిన పెద్దల పైశాచిక వ్యాఖ్యలా.. చివరికి అక్టోబర్‌ 8న మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. కృష్ణ కుటుంబ సభ్యులు.. అమ్మాయి తరఫు వారు బలవంతం చేయడమో, లేదా ప్రేరేపించడమో వల్లే తమ కుమారుడు విషం తాగాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమంటే పవిత్రత, త్యాగం.. కానీ దాన్ని ఇంతటి భయంకరమైన పరీక్షతో నిరూపించుకోవాలని పెద్దలు కోరడం, దానికి అమాయకపు యువకుడు బలైపోవడం.. నిజంగా ఇది గుండెల్ని పిండేసే విషాదం.
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)