Breaking News

వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..

Published on Mon, 08/28/2023 - 09:43

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు.

'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ.  పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు.

తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది.  వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు. 

బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు  గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు.

మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. 

ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు.

ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు