Breaking News

‘సిక్‌’ అని మెసేజ్‌ చేసిన 10 నిమిషాలకే..

Published on Mon, 09/15/2025 - 07:11

న్యూఢిల్లీ: హఠాత్తుగా ఒంట్లో బాగోలేదంటూ ఉన్నతాధికారికి స్మార్ట్‌ఫోన్‌లో సందేశం పంపిన పది నిమిషాలకే ఆ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్లకే ఓ ఉద్యోగి నూరేళ్లు నిండిన విషాద ఘటన తాలూకు వివరాలను పైఅధికారి కేవీ అయ్యర్‌ ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘‘నా కింది ఉద్యోగి శంకర్‌ నుంచి ఉదయం 8.37 గంటలకు ఒక మెసేజ్‌ వచ్చింది.

భయంకరమైన వెన్నునొప్పి కారణంగా ఈరోజు ఆఫీస్‌కు రాలేకపోతున్నా, ఒక రోజు సెలవు ఇవ్వండి అని అందులో ఉంది. సరే విశ్రాంతి తీసుకో అని సమాధానం ఇచ్చా. ఆ తర్వాత కేవలం 10 నిమిషాలకే కుప్పకూలి శంకర్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి తర్వాత నాకొక ఫోన్‌కాల్‌ వచ్చింది. శంకర్‌ చనిపోయాడని అవతలి వ్యక్తి చెబితే నమ్మలేకపోయా. వెంటనే మరో ఉద్యోగికి ఫోన్‌చేసి ఆరాతీశా.

10 నిమిషాలకే చనిపోయాడని వాళ్లు కూడా చెప్పడంతో నిశ్ఛేష్డుడినయ్యా. వెంటనే శంకర్‌ ఇంటి అడ్రస్‌ కనుక్కుని పరుగున వెళ్లా. కానీ అతనిక లేడని తెల్సి దుఃఖంలో మునిగిపోయా. శంకర్‌ ఆరేళ్లుగా మా ఆఫీస్‌లోనే పచిచేస్తున్నాడు. వయసు కేవలం 40 ఏళ్లు. పెళ్లయింది. వాళ్లకొక పసి పిల్లాడు ఉన్నాడు. అతనికి ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు లేవు. మరునిమిషం ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. చుట్టూ ఉన్న వాళ్లతో హాయిగా ఉండండి. చివరిదాకా జీవితాన్ని ఆస్వాదించండి’’ అని అన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)