Breaking News

శనిమందిరంలో దొంగబాబా తిష్ట.. మూడు ‘ఆధార్‌’లో పట్టుకున్న పోలీసులు

Published on Tue, 08/05/2025 - 09:25

పట్నా: దేశంలో దొంగ బాబాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో పోలీసులకు పట్టుబడుతున్న నకిలీ బాబాల గణాంకాలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా మరో దొంగబాబా పోలీసులకు చిక్కాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమాముద్దీన్ అన్సారీ(55) బెంగాలీ బాబా అలియాస్‌ బాలక్‌నాథ్ పేరుతో చలామణీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ దొంగబాబా ఏకంగా మూడు ఆధార్ కార్డులు, పాన్‌ కార్డుతో పోలీసులకు చిక్కాడు.

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని థానా భవన్ పరిధిలోని మంతి హసన్‌పూర్ గ్రామంలోగల శని మందిర్‌లో బెంగాలీ బాబా తిష్ట వేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అతని అసలు గుర్తింపు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం అతనిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో అన్సారీ నుండి పోలీసులు మూడు ఆధార్ కార్డులు, ఒక పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆధార్ కార్డులో బంగాలీ నాథ్  పేరు, సహరాన్‌పూర్‌లోని ఒక ఆలయానికి సంబంధించిన చిరునామా ఉంది. మిగిలిన రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులలో అతని అసలు పేరు ఇమాముద్దీన్ అన్సారీ , పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాలోని చిరునామా ఉన్నాయి.

ఎస్పీ రాంసేవక్ గౌతమ్ మాట్లాడుతూ, నకిలీ పత్రాలు కలిగివుండటం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమనే ఆరోపణలతో నిందితునిపై కేసు నమోదు చేశామన్నారు. అతనిని కైరానా కోర్టు ముందు హాజరుపరచగా,  14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారని తెలిపారు. అన్సారీకి సంబంధించిన  వివరాలను సేకరించేందుకు యూపీ పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు ఒక బృందాన్ని పంపారు. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటన స్థానిక హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇలాంటివారిపై పోలీసులు కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు