అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
Published on Thu, 03/14/2024 - 20:31
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్’ట్విటర్’లో వెల్లడించింది.
మమతా తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్‌పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమెకు ఈ గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక ఈ ఏడాది జనవరిలోనూ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది.
Our chairperson @MamataOfficial sustained a major injury.
Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE
— All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024
Tags : 1