Breaking News

బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎంలది మరోదారి: మమత

Published on Tue, 06/27/2023 - 06:30

కూచ్‌బెహార్‌: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని టీఎంసీ చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల చర్యలు రాష్ట్రంలో బీజేపీకి లాభం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. కూచ్‌బెహార్‌లో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు మేం మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

కానీ, బెంగాల్‌ల్‌లో మాత్రం సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయి. అటువంటి అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాం’అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ బెంగాల్‌ అధ్యక్షుడు ఆధిర్‌ రంజన్‌ ఛౌధురి స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టీఎంసీ విశ్వసనీయతపై ఎప్పటి నుంచో అనుమానాలున్నాయన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమకు చెప్పే అర్హత మమతా బెనర్జీకి లేదని సీపీఎం ఎదురుదాడి చేసింది.  ఈ నెల 23న బిహార్‌లోని పట్నాలో సీఎం నితీశ్‌ సారథ్యంలో 12కు పైగా రాజకీయ పార్టీల నేతలు సమావేశమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలని వీరు నిర్ణయించారు. తాజాగా మమతా బెనర్జీ మరో బాంబు పేల్చడం గమనార్హం.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)