Breaking News

‘మహా కుంభ్‌కాదు.. మృత్యుకుంభ్’ : దీదీ

Published on Tue, 02/18/2025 - 16:34

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ‘మహాకుంభ మేళా’ను (Maha Kumbha Mela) మహా కుంభ్‌ కాదు.. మృత్యుకుంభ్‌ అని వ్యాఖ్యానించారు.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మమతా బెనర్జీ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. ‘కుంభమేళాకు వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.. యూపీ సర్కార్‌ వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసింది. సామాన్యుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.నేను మహా కుంభమేళాను గంగామాతకు గౌరవ సూచికంగా భావిస్తున్నాను. కానీ పేదలకు కనీస సదుపాయాలు లేవు. వీఐపీల కోసం మాత్రమే ఏర్పాట్లు చేశారు.  

తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. పోస్ట్‌మార్టం చేయకుండా మృతదేహాల్ని వారి కుటుంబాలకు అప్పగించారు. పోస్టుమార్టం చేసి, డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తేనే కదా ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందేది. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఎక్స్‌ గ్రేషియా ఎలా పొందుతారు’ అని ప్రశ్నించారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో (Prayag Raj) జనవరి 13 ప్రారంభమైన మహాకుంభ మేళా 45 రోజులపాటు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)