Breaking News

భారత్‌కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా?

Published on Wed, 05/08/2024 - 09:38

ఢిల్లీ: భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా విబేధాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వివరాల ప్రకారం.. గురువారం(మే 9వ తేదీన) భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మూసా జమీర్‌ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్‌, మాల్దీవుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అందిస్తుందని  భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.

ఇక, మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మే 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేశారు.

ఇదిలా ఉండగా.. మాల్దీవులకు మయిజ్జు అధ్యక్షుడైన తర్వాత భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్‌ కంట్రీ చైనాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా మాల్దీవులకు కౌంటరిచ్చే విధంగా లక్షద్వీప్‌కు సపోర్టు చేశారు. దీంతో, మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపించింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)