భారత్‌కు మలేషియా ప్రధాని.. పీఎం మోదీతో భేటీ

Published on Tue, 08/20/2024 - 07:03

భారత్‌- మలేషియాల దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేదిశగా మరో ముందడుగు పడబోతోంది. మలేషియా ప్రధాని అన్వర్‌ ఇ‍బ్రహీం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ చేరుకున్నారు.

ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) మలేషియా ప్రధానితో విస్తృత చర్చలు జరపనున్నారు.  అనంతరం భారతీయ కార్మికుల రిక్రూట్‌మెంట్‌తో సహా పలు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారతదేశం నుండి మలేషియాకు అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.

మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే అంశంపై కూడా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్‌తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే దీనిపై ఎటువంటి పురోగతి కానరాలేదు. ఆర్థిక మోసం కేసులో నాయక్ భారత్‌లో వాంటెడ్ గా ఉన్నాడు. మలేషియా ప్రధాని ఇబ్రహీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా ప్రధానిని కలుసుకున్నారు.
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)