Breaking News

వీడియో చూస్తే షాకే.. వామ్మో.. ఒక్కసారిగా 30 అడుగులు..!

Published on Tue, 10/14/2025 - 09:11

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖేరియాలో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డు సడన్‌గా 30 అడుగుల మేర కుంగిపోయింది. మండిదీప్ నుండి ఇంత్ఖేడి వెళ్లే రోడ్డులోని వంతెన సమీపంలో ఈ ఘటన జరగ్గా.. అదృష్టవశాత్తూ  ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ  వంతెనను దశాబ్దం క్రితం నిర్మించారు.

ఈ రహదారి.. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MPRDC) పరిధిలోకి వస్తుంది. ఇండోర్, హోషంగాబాద్, జబల్‌పూర్, జైపూర్, మాండ్లా, సాగర్ వంటి ముఖ్యమైన మార్గాలను కలుపుతుంది. ఈ ఘటనతో రహదారుల నాణ్యతపై చర్చ నడుస్తోంది.

రహదారి కూలిపోవడానికి గల కారణాన్ని పరిశోధించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో రీఎన్‌ఫోర్స్డ్ ఎర్త్ (RE) గోడ కూలిపోవడం వల్ల జరిగిందని తెలుస్తోంది. దర్యాప్తు నివేదిక విడుదలైన తర్వాత ప్రమాదానికి గల కారణం స్పష్టమవుతుందని MPRDC డివిజనల్ మేనేజర్ సోనాల్ సిన్హా మీడియాకు తెలిపారు.

ఈ వంతెన 2013లో నిర్మించారు. అయితే, నిర్మాణ సంస్థ M/s ట్రాన్స్‌స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్‌ టెండర్‌ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా ఏ సంస్థ కూడా పర్యవేక్షించలేదు. గతంలో, గ్వాలియర్‌లో 18 కోట్ల రూపాలయతో నిర్మించిన రోడ్డు ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయిన సంగతి తెలిసిందే.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)