Breaking News

ఎయిర్ ఫోర్స్ అధికారులను చంపింది మాలికే

Published on Sun, 11/23/2025 - 16:07

1990లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అధికారుల హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఆ హత్య సమయంలో ఎయిర్ ఫోర్స్ అధికారిని షూట్ చేసింది జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్ అని ప్రధాన సాక్షి గుర్తించారు. ఈ కేసు విచారణ టాడా కోర్టులో జరుగగా యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడని కాల్పుల సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

1990లో జమ్మూకశ్మీర్ శ్రీనగర్ పరిసరాల్లో జరిగిన నలుగురు ఎయిర్ ఫోర్స్ అధికారుల హాత్య కేసు విచారణను ప్రత్యేక టాడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను విచారించింది. ఆరోజు అధికారులను కాల్చి చంపింది జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ అనే ప్రధాన సాక్షి తెలిపారు. ఈ కేసులో మాలిక్ ను ఎలా గుర్తించారని ప్రశ్నించగా  "మాలిక్ గడ్డం స్టైల్ తప్ప ప్రస్తుతం ఏమీ మారలేదు కనుక నిన్ను గుర్తించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు" అని ప్రధాన సాక్షి అన్నారు. అంతే కాకుండా ఆరోజు దాడిచేసిన మరో ముగ్గురు షౌకత్ భక్షి, నన్నాజీ, జావేద్ అహ్మద్ లను సాక్షులు గుర్తించారు. ఆరోజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు.

అసలేం జరిగింది

1990 జనవరి 25న శ్రీనగర్ రవల్పురా వద్ద  బస్సుకోసం వేచి చూస్తున్న వారిపై యాసిన్ మాలిక్ నేతృత్వంలోని టెర్రరిస్టుల బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు మృతిచెందారు. కాగా ఆ ఘటనలోప్రధాన నిందితుడిగా ఉన్న యాసిన్ మాలిక్ ప్రస్తుతం టెర్రర్ ఫండింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)