Breaking News

అస్సాంలో గాంధీ విగ్రహం తొలగింపు.. తనకు తెలియదన్న సీఎం

Published on Fri, 07/12/2024 - 17:57

గువాహ‌తి: అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొల‌గించారు. టిన్సుకియా జిల్లా దూమ్‌దూమా లోని గాంధీ చౌక్‌లో ఉంచిన 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అక్క‌డి నుంచి తొలగించడం వివాదానికి దారి తీసింది. మ‌హాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించడంపై విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశాయి.  ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఏఏఎస్‌యూ) నిరసనలు చేపట్టింది.

అయితే, విగ్రహం తొలగింపు నిర్ణయం గురించి తనకు తెలియదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్ల‌డించారు. ‘జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నాకు తెలియదు. వాస్తవం ఏంటో తెలుసుకుంటా.  అస్సాం మహాత్మా గాంధీకి చాలా రుణపడి ఉంది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అస్సాంను పాకిస్తాన్‌లో చేర్చాలని కోరినప్పుడు ఆయన భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్‌కు గాంధీ అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు.

మ‌రోవైపు గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా విగ్రహం తొలగింపుపై మండిపడ్డారు. ‘అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం దిబ్రూగఢ్‌లో బాపు విగ్రహం స్థానంలో క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ కూడా ప్రభుత్వం చర్యను త‌ప్పుబ‌ట్టింది.

తాము నగర సుందరీకరణ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించ‌డం లేద‌ని, కానీ అందుకు గాంధీ విగ్రహాన్ని తొల‌గించ‌డం స‌రికాద‌ని అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గ భూమిజ్. విగ్ర‌హాన్ని తొల‌గించ‌డాన్ని అంగీక‌రించ‌మ‌ని..  విగ్రహాన్ని అలాగే ఉంచి, క్లాక్ టవర్‌ను నిర్మించాల‌ని సూచించారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)