Breaking News

పుట్టినరోజున ప్రత్యేక కానుక.. షాక్‌ అయిన యువతి

Published on Wed, 07/12/2023 - 08:41

ముంబై: పుట్టినరోజు అంటే సంబరం. అందులోనూ జన్మదిన వేడుకలో అందుకునే చిన్న చిన్న కానుకలు అంటే అపురూపంగా చూసుకుని మురిసిపోతారు. అలాంటిది ఒక మహిళ అనూహ్యంగా టమాటాలను గిఫ్ట్‌గా అందుకుని ఆశ్చర్యంలో మునిగింది. మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఈ కొత్తరకం బహుమతి ఘటన జరిగింది. సంబంధిత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

థానె జిల్లాలోని కళ్యాణ్‌ ప్రాంతంలోని కొచాడీలో ఉండే సోనల్‌ బోర్సే పుట్టినరోజు వేడుక ఆదివారం జరిగింది. ఆ ప్రాంతంలో కేజీ టమాటా ఏకంగా రూ.140 ధర పలుకుతోంది. అదే రోజు ఆమె నాలుగు కేజీలకుపైగా టమాటాలు ఉన్న బుట్టలను బహుమతిగా అందుకున్నారు. ఈసారి అకాల వర్షాలు, బిపర్‌జోయ్‌ తుపాను మిగిల్చిన విషాదం కారణంగా పంట నాశనమై దిగుబడి భారీగా తగ్గిపోయి టమాటా ధర రిటైల్‌ మార్కెట్లో చుక్కలనంటుతోంది. కొద్దిరోజులు గడిస్తే కొత్త పంట వచ్చి ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్‌ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)