బీజేపీకి ఎమ్మెల్సీ ఫలితాల షాక్‌.. అయిదు స్థానాల్లో మూడు ఓటమి

Published on Sat, 02/04/2023 - 14:28

సాక్షి ముంబై: ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలు ఐదింటికి జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్‌ ఇచ్చాయి. అయిదింటిలో మూడు స్థానాలను శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్‌ ఆఘాడి(ఎంవీఏ) కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని బీజేపీ, మరోస్థానంలో ఇండిపెండెంట్‌ విజయం సాధించారు. ఇటీవలే ఐదు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం వరకు లెక్కింపు కొనసాగింది. అనంతరం అయిదు నియోజకవర్గాల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. 

జ్ఞానేశ్వర్‌ మాత్రే విజయంతో ఊరట
ఐదు నియోజకవర్గాల్లో మహావికాస్‌ ఆఘాడీ మూడింటిని కైవసం చేసుకోగా బీజేపీ ఒకస్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా అమరావతి పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి రంజిత్‌పాటిల్‌ ఓడిపోయారు. మరాఠ్వాడాలో మహావికాస్‌ ఆఘాడి అభ్యర్థి విక్రమ్‌ కాలే  విజయం సాధించారు. ఇక నాగపూర్‌ ఉపాధ్యాయుల స్థానంలో బీజేపీ బలపరిచిన నాగో గానార్‌లు పరాజయం పాలయ్యారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల సొంత నియోజకవర్గమైన నాగపూర్‌లో పరాజయం పాలవడం ఆ పార్టీని షాక్‌కు గురి చేసింది. కొంకణ్‌లో బీజేపీ అభ్యర్థి జ్ఞా్ఞనేశ్వర్‌ మాత్రే విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది.

నాసిక్‌లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి సత్యజిత్‌ తాంబే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ స్థానంలో ఆయనకు బీజేపీ మద్దతు పలికింది. దీంతో ఫలితాల అనంతరం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా లేదా బీజేపీలో చేరుతారా అనే అంశంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. తాంబే నుంచి మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేద
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)