Breaking News

కిలో మునక్కాయలు రూ. 400, కూరగాయల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

Published on Fri, 12/13/2024 - 17:12

దాదర్‌:  మ‌హారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్‌ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు.  

కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే... 
ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి. 

రాష్ట్రంలోని హోల్‌సేల్‌ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.

వంటనూనెలదీ ఇదే దారి... 
కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్‌ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్‌ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.      

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)